వంశాభివృద్ధిని కలిగించే అభిషేకం

ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలంటే వివిధ రకాల అభిషేకాలతో ఆయన్ని సంతోషపెట్టాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పంచామృతాలతోను ... వివిధ రకాల పండ్ల రసాలతోను పరమశివుడిని అభిషేకిస్తూ వుంటారు. ఒక్కో అభిషేక ద్రవ్యంతో శివుడిని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది.

అందువలన భక్తులు తమ మనోభీష్టాన్ని బట్టి, ఆయా అభిషేక ద్రవ్యాలతో శంకరుడిని అభిషేకిస్తూ వుంటారు. పాపాలను నశింపజేసుకుంటూ పుణ్యఫలాలను పొందుతూ వుంటారు. ఈ నేపథ్యంలో రుద్రాభిషేకం ... ఏకాదశ రుద్రాభిషేకం ... శత రుద్రాభిషేకం ... మహా రుద్రాభిషేకం వంటివి మరింత విశిష్టమైనవిగా పేర్కొనడం జరుగుతోంది.

ఇవన్నీ కూడా వేటికవే విశేషమైన ఫలితాలను అందిస్తుంటాయి. వీటిలో 'శత రుద్రాభిషేకం' సంపదలను ప్రసాదించడమే కాకుండా వంశాభివృద్ధిని కలిగిస్తుందని చెప్పబడుతోంది. శివుడికి అభిషేకం చేసే వివిధ ద్రవ్యాలను బట్టి, అవి ఆయురారోగ్యలను ... అష్టైశ్వర్యాలను ... మోక్షాన్ని ప్రసాదిస్తూ వుంటాయి. శతరుద్రాభిషేకం వలన ధనవృద్ధితో పాటు వంశాభివృద్ధి కలుగుతోందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News