శ్రావణంలో చేయవలసిన పారాయణం

శ్రావణ మాసం ... ఆధ్యాత్మిక పరమైన సందడినీ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సందడిని ఆవిష్కరించే మాసంగా కనిపిస్తూ వుంటుంది. మంగళవారాల్లో గౌరీదేవినీ ... శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ మహిళా భక్తులు అందరూ కూడా తీరిక లేకుండా వుంటారు.

నోములు - వ్రతాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం ... తోరాలను సిద్ధం చేసుకోవడం ... అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారుచేసుకోవడం ... పేరంటాలను పిలవడం ... వచ్చిన వాళ్లకి వాయనాలు సమర్పించడం ... ఇలా అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతో సహనంతో తమ సమయాన్నంతా కేటాయిస్తూ వుంటారు. మంగళవారమైతే గౌరీదేవికి సంబంధించినవి ... శుక్రవారమైతే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు ... అష్టోత్తరాలు ... సహస్రనామాలు చదువుతుంటారు. కొన్ని గ్రంధాలను పారాయణం కూడా చేస్తుంటారు.

అయితే శ్రావణమాసంలో 'శ్రీ సూక్త పారాయణ' విశిష్టమైనదని శాస్త్రం చెబుతోంది. ఈ మాసమంతా కూడా ఈ పారాయణ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ విధంగా చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది. అందుకే అత్యంత పవిత్రమైన ... అమ్మవార్లకి ప్రీతికరమైన ఈ శ్రావణమాసంలో, శ్రీసూక్తం చదువుకోవడం మరవకూడదు.


More Bhakti News