గుడ్లగూబ ఈ ప్రదేశాల్లో కనిపిస్తే ?

పగలు ఎక్కడా కనిపించకుండా రాత్రివేళల్లో మాత్రమే సంచరించే గుడ్లగూబకి చాలామంది భయపడుతుంటారు. గుడ్లగూబ కళ్లు ... తీక్షణమైన దాని చూపులు ... అది చేసే చిత్రమైన ధ్వని ఎవరికైనా సరే ఆందోళన కలిగిస్తూ వుంటాయి. మొదటి నుంచి కూడా 'కీడు' కలిగించే పక్షిగా దానికి పేరు పడిపోవడం వలన, దాని వైపు చూడటానికే ఎవరూ ఇష్టపడరు. అది కనిపించడం ... దాని అరుపు వినిపించడం చెడుకి సంకేతంగా భావిస్తుంటారు.

నిజానికి గుడ్లగూబ వలన కేవలం అపశకునాలు మాత్రమే కాదు ... కొన్ని శుభాలు కూడా కలుగుతాయని చెప్పబడుతోంది. సాక్షాత్తు లక్ష్మీదేవి కొన్ని సందర్భాల్లో గుడ్లగూబను వాహనంగా చేసుకోవడం ఈ విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నట్టుగా చెప్పుకుంటూ వుంటారు. సాధారణంగా పల్లె ప్రాంతాల్లో గుడ్లగూబలు ఎక్కువగా సంచరిస్తూ వుంటాయి.

పశువుల కొట్టంపై గుడ్లగూబ వాలినా ... అక్కడ అది గూడును ఏర్పాటు చేసుకున్నా పాడి అభివృద్ధి చెందుతుందని చెప్పబడుతోంది. అలాగే ధాన్యాన్ని నిల్వచేసుకునే ప్రదేశంలో గుడ్లగూబ సంచరించినా, అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా ఆ ఇంట ధాన్యానికి ఎలాంటి లోటు రాదని స్పష్టం చేయబడుతోంది. అందువలన గుడ్లగూబ శకునం కొన్ని శుభాలను కూడా కలిగిస్తోందని చెప్పబడుతోంది.


More Bhakti News