శ్రావణమాసంలో గృహనిర్మాణం !

శ్రావణమాసం శుభప్రదమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివుడిని ... మంగళవారం రోజున మంగళ గౌరిని ... శుక్రవారం రోజున లక్ష్మీదేవిని .. శనివారం రోజున శ్రీమన్నారాయణుడిని పూజించడం వలన సకల శుభాలు చేకూరతాయని అంటారు.

ఇలా లక్ష్మీనారాయణులు ... శివపార్వతులు పూజలందుకునే ఈ పవిత్రమైన మాసంలో వివిధ శుభకార్యాలు జరుపుతుంటారు. ముందుగానే ముహూర్తాలు సిద్ధం చేసుకున్న వాళ్లు, ఈ మాసం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇంతటి విశిష్టతను కలిగిన ఈ మాసంలో ఎక్కువగా గృహనిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు.

జీవితంలో అసలైన సంతోషం ... సంతృప్తి సొంతఇంటిని నిర్మించుకోవడంలోనే కలుగుతుంది. ఇక ఎన్ని ఆనందాలువున్నా దీని తరువాతననే చెప్పుకోవాలి. అలాంటి ఇంటి నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆరంభించవలసి వుంటుంది. గృహనిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వుండాలి. నిర్మాణం పూర్తయిన తరువాత అందులో కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ... ఆనందంగా వుండాలి. ముఖ్యంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం చేయాలి.

ఇలా ఈ మాసంలో గృహనిర్మాణం చేపట్టడం వలన అత్యున్నతమైన ఫలితాలను అందుకోవచ్చు. దేవతల అనుగ్రహాన్ని త్వరగా అందించే ఈ శుభప్రదమైన మాసంలో సొంతఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం వలన ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయని 'మత్స్యపురాణం' చెబుతోంది.


More Bhakti News