ఇలా చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయట !

సాధారణంగా రాహు - కేతు దోషాలు ఉన్నట్టుగా తెలియగానే చాలామంది తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. ఎందుకంటే ఆ దోషాల వలన ఎదురయ్యే పరిస్థితులు ... కలిగే ఫలితాలు అలా వుంటాయి. అందువలన ఆ దోషాల నుంచి బయటపడటానికి ఎవరికి వారు తమ స్థాయిలో ప్రయత్నించడం మొదలుపెడతారు. ఆ గ్రహాలను శాంతింపజేయడం కోసం ఆయా క్షేత్రాలను దర్శిస్తుంటారు.

రాహువునకు అధిదేవత పృథ్వీ అయితే ... కేతువునకు అధిదేవత చిత్రగుప్తుడు. రాహువు - కేతువు దోషాల వలన వ్యసనాల బారినపడటం .. నేరస్వభావం పెరిగిపోవడం ... అనారోగ్య సమస్యలు ... ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది. ఈ దోషాలు అభివృద్ధి వైపు అడుగు వేయనీయకుండా పతనం వైపు పరుగులు తీయిస్తుంటాయి.

అలాంటి ఈ దోషాల నుంచి బయటపడాలంటే నాగేంద్రుడిని ఆవుపాలతో అభిషేకించాలని శాస్త్రం చెబుతోంది. రాహు సంబంధిత దోషాలతో బాధపడుతోన్న వాళ్లు శుక్రవారాల్లోను, కేతు గ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు మంగళవారాల్లోను నాగేంద్రుడికి ఆవుపాలతో అభిషేకిస్తూ వుండటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News