కలలో తేనెపట్టు కనిపిస్తే ?

సాధారణంగా కలలనేవి ప్రతి ఒక్కరికీ వస్తూనే వుంటాయి. ఇలా వచ్చిన కలలో కొన్ని ఆనందాన్ని కలిగించేవి ... మరికొన్ని ఆందోళన కలిగించేవి ఉంటూ వుంటాయి. వచ్చింది మంచి కల అయితే అది త్వరగా నిజమైతే బాగుండునని అనిపిస్తుంది. చెడు కల అయితే ఎక్కడ నిజమవుతుందోననే భయం వెంటాడుతూ వుంటుంది. ఇక వచ్చింది ఏ కల అయినా, ఆ సమయాన్ని బట్టి మాత్రమే అది నిజమవుతుందని చెప్పబడుతోంది.

ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ పడుకున్నప్పుడు అందుకు సంబంధించి వచ్చే కల, అనారోగ్యంతో వున్నప్పుడు వచ్చే కలలు పరిగణలోకి తీసుకోకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే కల ఏదైనా అది తెల్లవారు జామున వచ్చినప్పుడు మాత్రమే నిజమవుతుందని స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో ఒక్కో దృశ్యం కనిపించడం వలన ఒక్కో ఫలితం కలగడం జరుగుతుందని చెప్పనడుతోంది.

కొన్ని కలలు త్వరలో రానున్న అనారోగ్యాలను ... ఆపదలను ... కష్ట నష్టాలను ... ఆకస్మిక ధనలాభాలను ముందుగానే తెలియజేస్తుంటాయి. ఇక కొన్ని దృశ్యాలు కలలో కనిపించడం వలన ఆర్ధికపరమైన నష్టం జరుగుతుంది. అలాగే మరికొన్ని దృశ్యాలు కలలోకి వస్తే ఆర్ధికపరమైన లాభాలు వస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో 'తేనెపట్టు' కనిపిస్తే ధనలాభం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది. తేనెపట్టు కలలో కనిపించడం వలన, ఏదో ఒక రూపంలో ధనలాభం ప్రాప్తిస్తుందని స్పష్టం చేస్తోంది.


More Bhakti News