'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ

  • అర్ధరాత్రి 1 గంట షోకు అనుమతి నిరాకరణ
  • విడుదల రోజున ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు అనుమతి
  • టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రేపు విడుదలవుతోంది. టిక్కెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోల కోసం సినిమా బృందం విజ్ఞప్తి చేసింది. అర్ధరాత్రి గం.1కి పెంచిన ధరతో బెనిఫిట్ షోను అనుమతించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది.

సినిమా విడుదల రోజున ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజున సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు ఐదు షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News