అలా చేసి ఉంటే నితీశ్ కుమార్ ఇండియా కూటమిలోనే ఉండేవారు: ఒమర్ అబ్దుల్లా

  • కూటమి బాధ్యతలు అప్పగించి ఉంటే అధికార పార్టీ వైపు వెళ్లకపోయేవారన్న ఒమర్
  • నాయకత్వ హోదాలో ఉన్న కాంగ్రెస్ సరైన రీతిలో స్పందించడం లేదని విమర్శ
  • కూటమిలోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్న జమ్మూకశ్మీర్ సీఎం
ఇండియా కూటమి బాధ్యతలు బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు అప్పగించి ఉంటే ఆయన కూటమిలోనే ఉండేవారని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆజ్ తక్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కూటమిలో పెద్దన్న బాధ్యత తీసుకోవడంతో పాటు దానికి కాంగ్రెస్ పార్టీ సార్థకత చేకూర్చాలన్నారు.

దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ప్రాతినిథ్యం ఉందని, పార్లమెంట్‌లోనూ కూటమి తరఫున అతిపెద్ద పార్టీగా ఉందన్నారు. కానీ నాయకత్వ హోదాలో ఉన్న పార్టీ తగిన రీతిలో స్పందించడం లేదనేదే కూటమి పార్టీల అసహనానికి కారణమన్నారు. కూటమిని సోనియాగాంధీ సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లారన్నారు.

ఇండియా కూటమి ఏర్పాటులో కూడా ఆమె కీలక పాత్రను పోషించారన్నారు. నాయకత్వం వహించేందుకు మమతాబెనర్జీ, శరద్ పవార్ లాంటి నేతలు ముందుకు రావడం పైనా ఆయన స్పందించారు. కూటమిలోని పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు సహజమే అన్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకుంటామన్నారు.


More Telugu News