బ్రిస్బేన్‌ టెస్టు.. వ‌రుణుడి ఆటంకం.. ముగిసిన‌ తొలిరోజు ఆట‌

  • బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య‌ మూడో టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • వ‌రుణుడి ఆటంకంతో కేవలం 13.2 ఓవ‌ర్లతోనే ముగిసిన‌ తొలిరోజు ఆట‌
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జ‌రుగుతున్న‌ మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలిరోజు కేవ‌లం 13.2 ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. తొలి సెష‌న్ మ‌ధ్య‌లో వ‌ర్షం ప‌డ‌టంతో ఆట‌ను ఆపేశారు. 

ఆ త‌ర్వాత కూడా వ‌ర్షం త‌గ్గ‌లేదు. దాంతో రెండు, మూడు సెష‌న్ల‌లో ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖావాజా (19), నాథన్ మెక్‌స్వీనీ (4) క్రీజులో ఉన్నారు. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ర‌విచంద్ర‌న్ అశ్విన్, హర్షిత్ రాణా స్థానంలో రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్ తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1-1తో సమం చేసిన విష‌యం తెలిసిందే. 


More Telugu News