అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
- రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ ఘటన అన్న కేంద్రమంత్రి
- తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలంటూ విమర్శ
- బాధిత కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన జరిగిందని, తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ అంటూ కొత్త ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులపై వరుస దాడులు చేయడాన్ని ఆపేసి... బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి ఈ ఘటన ద్వారా రుజువైందన్నారు. ఆరోజు ఏర్పాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంధ్య థియేటర్ వద్ద పూర్తి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల దుర్ఘటన జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇలాంటి ఆనవాయతీ కొనసాగడం ఆందోళన కలిగించే అంశమన్నారు.