నా తొలి ప్రసంగం కంటే బాగుంది: ప్రియాంకగాంధీ ప్రసంగంపై రాహుల్ గాంధీ ప్రశంస
- చాలా విషయాలపై ఆమె అద్భుతంగా మాట్లాడారన్న రాహుల్ గాంధీ
- ప్రతి విషయాన్ని సమగ్రంగా వివరించారని కితాబు
- విపక్షాల తరఫున రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన ప్రియాంక గాంధీ
లోక్ సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తన తొలి ప్రసంగం కంటే ప్రియాంక ప్రసంగం బాగుందని కితాబునిచ్చారు. చాలా విషయాలపై ఆమె అద్భుతంగా మాట్లాడారన్నారు. ప్రతి విషయాన్ని సమగ్రంగా వివరించారన్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకగాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. తాజాగా రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా సభలో ఆమె తొలి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై రాహుల్ గాంధీ పైవిధంగా స్పందించారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్ సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. విపక్షాల తరఫున ప్రియాంక గాంధీ చర్చను ప్రారంభించారు. ప్రసంగం సందర్భంగా ఆమె బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక వ్యక్తి కోసం 142 కోట్ల మంది ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించిందన్నారు. కానీ లోక్ సభ ఫలితాల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గిందన్నారు.