హ‌త్యాయ‌త్నం కేసు... తెలంగాణ హైకోర్టులో మోహ‌న్ బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌

       
టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌ల్‌ప‌ల్లిలోని త‌న నివాసంలో జ‌ర్న‌లిస్టుపై దాడి ఘ‌ట‌న‌లో ఆయ‌న‌పై ప‌హాడీ ష‌రీష్ పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఈ ఘ‌ట‌న‌లో మొద‌ట‌ మోహ‌న్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద కేసు న‌మోద‌యింది. ఆ త‌ర్వాత లీగ‌ల్ ఒపీనియ‌న్ తీసుకున్న ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు... గురువారం నాడు ఆయ‌న‌పై 109 సెక్ష‌న్ కింద హ‌త్యాయ‌త్నం కేసు కూడా న‌మోదు చేశారు. ఈ కేసులో పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు చేప‌ట్ట‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని మోహ‌న్ బాబు తాజాగా దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. 


More Telugu News