2025లో పెను యుద్ధాలు.. భయపెడుతున్న బాబా వంగా జోస్యాలు ఇవే!

  • తూర్పు, పశ్చిమ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అంచనా
  • ఐరోపాలో భారీ విధ్వంసం జరుగుతుందని జోస్యం
  • గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడుతుందన్న బాబా వంగా
‘బాబా వంగా’గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాంజెలియా పాండేవా గుష్టెరోవా అనే బల్గేరియా అంధ ఆధ్యాత్మికవేత్త గురించి అందరికీ తెలిసిందే. ఆమె చెప్పే జోస్యాలు నిజమవుతాయనే భావన ఇందుకు కారణంగా ఉంది. కాగా, మరికొన్ని రోజుల్లోనే ఆరంభమవనున్న నూతన సంవత్సరం 2025కి సంబంధించి బాబా వంగా చెప్పిన జోస్యాలు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా అశాంతిని రాజేసేవి, విధ్వంసాలకు మూలమయ్యే అంచనాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఐరోపా విధ్వంసం..
పశ్చిమ దేశాల్లో యుద్ధం పుడుతుందని, పెను విధ్వంసం జరుగుతుందని బాబా వంగా అంచనా వేశారు. ‘‘సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం ఉండొచ్చు. వసంతకాలంలో యుద్ధం ఆరంభమవుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం ఉంటుంది. తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుంది’’ అని బాబా వంగా జోస్యం చెప్పినట్టు ‘డైలీ స్టార్’ కథనం పేర్కొంది. సిరియా విజేత కాళ్ల మీద పడుతుందని, అయితే ఒక్కరు కాదని పేర్కొంది.

మరికొన్ని జోస్యాలు ఇవే
2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని బాగా వంగా అంచనా వేశారు. ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా అంతానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. కాగా, గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇక 2025 చివరి నాటికి టెలీపతి అందుబాటులో వస్తుందని, మనుషులు నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బాగా వంగా పేర్కొన్నారు. అంతేకాదు 2025లో ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు ఉంటాయని పేర్కొన్నారు. టెలీపతితో పాటు నానోటెక్నాలజీలో పురోగతి ఉంటుందని పేర్కొంది. అయితే సాంకేతికతలను దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.


More Telugu News