హైదరాబాద్‌లోని పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం

  • ఏక్‌మినార్ కూడలి వద్ద పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం
  • బంకులో పెట్రోల్ నింపడానికి వచ్చిన ట్యాంకర్ నుంచి మంటలు
  • పరుగు తీసిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్
  • మంటలు వ్యాపించకుండా చాకచక్యంగా వ్యవహరించిన ట్రాఫిక్ ఏసీపీ
హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఏక్‌మినార్ కూడలి వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఆయిల్ నింపడానికి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ సమయంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.

అదే సమయంలో గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి అటు నుంచి వెళుతున్నారు. ఆమె చాకచక్యంగా మంటలు బంక్‌లో వ్యాపించకుండా ట్యాంకర్‌ను నిలువరించారు. అనంతరం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. పెట్రోల్ బంకుకు మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేదని హైదరాబాద్ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.


More Telugu News