ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు భారీ ఊర‌ట‌!

    
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా లోకేశ్‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల కేసులో న్యాయ‌స్థానం ఆయ‌న‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

ఈ వివాదంలో ఆర్‌జీవీపై మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తాను అరెస్టు కాకుండా ముంద‌స్తు బెయిల్ కోసం ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఆయ‌న బెయిల్ పిటిష‌న్‌పై విచారణ జ‌రిపిన‌ కోర్టు మూడు కేసుల్లో ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 


More Telugu News