మంత్రాలతో కొడుకును చంపేశారని హైతీలో ఓ గ్యాంగ్ స్టర్ మారణహోమం
- ఇరుగుపొరుగు ఇళ్లల్లోకి చొరబడి ఊచకోత.. 200 మందికి పైగా హత్య
- మృతదేహాలను రోడ్డుపైనే కాల్చేసిన గ్యాంగ్ స్టర్ అనుచరులు
- వృద్ధులను టార్గెట్ చేసి హత్యలు.. కాపాడాలని చూసిన వారినీ కాల్చి చంపిన వైనం
హైతీలో ఓ గ్యాంగ్ స్టర్ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు.. మంత్రాలు చేయడం వల్లే ఈ అనారోగ్యానికి కారణమని స్థానిక పూజారి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఆ గ్యాంగ్ స్టర్.. తన అనుచరులతో కలిసి ఊరిలోని వృద్ధులను ఊచకోత కోశాడు. దాదాపు 200 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వృద్ధులను కాపాడేందుకు ప్రయత్నించిన వారినీ చంపేశాడు.
అసలేం జరిగిందంటే..
హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లో గ్యాంగ్ స్టర్ల ప్రభావం ఎక్కువ.. సిటీకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్ కొడుకు ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. దీనిపై స్థానిక మత గురువును ఆశ్రయించగా.. మంత్ర ప్రయోగమే కారణమని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గ్యాంగ్ స్టర్ వృద్ధులను, మంత్రాలు వచ్చనే అనుమానం ఉన్న వారిని టార్గెట్ చేసి సిటీలో మారణహోమం సృష్టించాడు. ఒక్క రోజే అరవై మందిని చంపేశాడు. ఇళ్లల్లోకి చొరబడి 60 ఏళ్లు పైబడిన వారిని కాల్చి చంపాడు. ఆ మరుసటి రోజే గ్యాంగ్ స్టర్ కొడుకు చనిపోయాడు.
కొడుకును కోల్పోయిన దు:ఖంతో మరింత రెచ్చిపోయిన గ్యాంగ్ స్టర్ వృద్ధులతో పాటు వారిని కాపాడేందుకు సిటీ నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారినీ చంపేశాడు. మూడు రోజుల పాటు సాగిన ఈ మారణహోమంలో 200 మందికి పైగా చనిపోయారని హైతీ అధికారవర్గాలు తెలిపాయి. గ్యాంగ్ స్టర్ అనుచరులు మృతదేహాలను నడిరోడ్డుపైనే కాల్చేయడంతో మరణించిన వారి సంఖ్యపై స్పష్టత కొరవడిందని వివరించాయి.