వామ్మో.. లోన్ పేరుతో రైతు నుంచి రూ.39వేల దేశీ కోడి మాంసం తినేసిన బ్యాంక్ మేనేజర్!
- ఛత్తీస్‌గఢ్‌లోని మస్తూరిలో ఘటన
- రూ. 12లక్షల రుణం కోసం మస్తూరి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసిన పౌల్ట్రీ రైతు
- లోన్ మంజూరు కోసం 10 శాతం కమీషన్‌తో పాటు రూ.39వేల దేశీ కోడి మాంసం తిన్న బ్యాంక్ మేనేజర్
- ఆపై రుణం కూడా మంజూరు చేయని వైనం
- దాంతో సబ్ కలెక్టర్ ను ఆశ్రయించిన బాధితుడు
ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లోన్ అప్రూవల్ పేరుతో బ్యాంక్ మేనేజర్ ఓ రైతు నుంచి రూ. 39వేల విలువైన దేశీ కోడి మాంసం ఆరగించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని మస్తూరిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే రూప్‌చంద్ మన్హర్ అనే రైతు తన పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు రూ. 12లక్షల రుణం కోసం మస్తూరి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిశాడు.
ఆయన 10 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు ప్రతి శనివారం దేశీ చికెన్ పంపాల్సిందిగా ఆదేశించాడు. అలా ఇప్పటివరకు రూ.39వేల విలువైన కోడి మాంసం తినేశాడా బ్యాంక్ మేనేజర్. కానీ, లోన్ మాత్రం మంజూరు చేయలేదు. దాంతో చేసేదేమీలేక బాధితుడు సబ్ కలెక్టర్ ను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రూప్‌చంద్ మన్హర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు 'నయీ దునియా' నివేదిక పేర్కొంది. తన ఫిర్యాదులో బ్యాంక్ మేనేజర్‌పై వెంటనే చర్య తీసుకోవాలని కోరాడు. దేశీ కోడి మాంసం కొనుగోలుకు తాను ఖర్చు చేసిన రూ.39వేలతో సహా మేనేజర్‌కు కమీషన్ రూపంలో ఇచ్చిన డబ్బు తిరిగి ఇప్పించాలని పేర్కొన్నాడు. అధికారులు చర్యలు తీసుకోకుంటే మస్తూరిలోని ఎస్‌బీఐ బ్రాంచ్ ముందు నిరాహారదీక్షకు కూర్చుంటానని, ఆత్మహత్య చేసుకుంటానని రూప్‌చంద్ మన్హర్ బెదిరించినట్లు నివేదిక పేర్కొంది.