బాలీవుడ్ రికార్డులను తిరగరాసిన పుష్పరాజ్
- ఆదివారం నాడు భారీ వసూళ్లు రాబట్టిన ‘పుష్ప-2’
- హిందీ వెర్షన్‌లో ఒక్కరోజే రూ.86 కోట్లు వసూలు
- అత్యధిక సింగిల్ డే కలెక్షన్ కొల్లగొట్టిన హిందీ చిత్రంగా రికార్డు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా హిందీలో సంచలనాత్మక రన్‌ను కొనసాగిస్తోంది.
బాలీవుడ్ రికార్డులను చెరిపివేస్తూ... విడుదలైన నాలుగవ రోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ.86 కోట్లు కొల్లగొట్టింది. హిందీలో అత్యధిక సింగిల్ డే వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రం వైల్డ్‌ఫైర్ బ్లాక్‌బస్టర్ అని, కేవలం 4 రోజుల్లోనే హిందీలో అత్యంత వేగంగా రూ.291 కోట్లు (నెట్) సాధించిన హిందీ సినిమాగా నిలిచిందని పేర్కొంది. కాగా హిందీ వెర్షన్‌లో విడుదలైన తొలి రోజున రూ.72 కోట్లు, రెండవ రోజు రూ.59 కోట్లు, మూడవ రోజు రూ.74 కోట్లు చొప్పున రాబట్టింది.
ఇక మొత్తంగా చూసుకుంటే పుష్ప-2 విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్లు (గ్రాస్) సాధించింది. త్వరలోనే రూ.1000 కోట్లు దాటడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.