ఈ సీన్ నా కెరీర్ లోనే ఓ మైలురాయి: మోహన్ బాబు
- 1979లో వచ్చిన కోరికలే గుర్రాలైతే చిత్రం
- ఇందులో ఓ సీన్ లో యముడి పాత్రలో మోహన్ బాబు
- ఈ సీన్ తనకు సవాల్ గా నిలిచిందని, సంతోషాన్ని కూడా ఇచ్చిందన్న మోహన్ బాబు
ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. 1979లో వచ్చిన 'కోరికలే గుర్రాలైతే' సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో తాను యమధర్మరాజుగా యాక్ట్ చేసిన ఓ సన్నివేశం వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు.
"కోరికలే గుర్రాలైతే... ఈ సినిమాకు నా గురువు, లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. జి.జగదీశ్ చంద్ర ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. ముఖ్యంగా, ఈ వీడియోలోని సీన్ నా కెరీర్ లోనే విశిష్ట మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్, మురళీమోహన్ లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో చిరస్మరణీయం.
యముడి పాత్రలో మొదటిసారిగా కనిపించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సన్నివేశం నాకు సవాల్ గా నిలిచింది, అదే సమయంలో సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఈ సన్నివేశం నా కెరీర్ లోనే ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిలిచిపోయేలా చేసింది" అని వివరించారు.