మా నాన్న పోలీసే.. నన్ను కాపాడతాడంటూ కారు బానెట్‌పై ప్రయాణించిన యువకుడు.. వీడియో ఇదిగో!
- నెల రోజుల క్రితం హర్యానాలో ఘటన
- 3.5 కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్న వీడియో
- తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు
- ముందు అతడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ డిమాండ్లు
సోషల్ మీడియా పైత్యం తలకెక్కిన యువత వెర్రితలలు వేస్తోంది. ఇందుకు బోల్డన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి రిస్కీ వీడియోలు చేస్తూ లైకులు, కామెంట్ల కోసం వెర్రిత్తిపోతున్నారు. తాజాగా, హర్యానాలో ఓ యువకుడు మహీంద్రా థార్ వాహనం బానెట్ పైన కూర్చుని ప్రయాణించాడు. స్నేహితులు అతడిని మరికొన్ని కార్లతో అనుసరించారు. నెల రోజుల క్రితం నాటిదిగా చెబుతున్న ఈ వీడియో సోషల్ మీడియాకెక్కి ఏకంగా 3.5 కోట్ల వ్యూస్ సాధించింది.
ఆ వీడియోలో యువకుడు మాట్లాడుతూ.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా పర్లేదని, పోలీస్ అయిన తండ్రి తనను రక్షిస్తాడని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. హర్యానాలో ఏం జరుగుతోందని, కుమారుడు ఇలాంటి ప్రమాదకర, పిచ్చి పనులు చేస్తుంటే తండ్రి అతడిని రక్షిస్తాడా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు అతడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలని మరో యూజర్ డిమాండ్ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమని, ఓ కుర్రాడు ఇలానే కూర్చుని ప్రయాణిస్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద కిందపడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడని ఇంకో యూజర్ పేర్కొన్నాడు. యువకుడిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.