అడిలైడ్ టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌట్
- రెండో టెస్టులో టీమిండియాకు కష్టాలు
- ఆసీస్ కు కీలమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- 157 పరుగుల లీడ్ లో ఆతిథ్య జట్టు
- సెంచరీతో రాణించిన ట్రావిస్ హెడ్
రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుగాలి వీస్తోంది! అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ డే/నైట్ టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే కుప్పకూలగా... ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ ను 337 పరుగుల వద్ద ముగించింది. దాంతో ఆతిథ్య జట్టుకు 157 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు. వైట్ బాల్ క్రికెట్ తరహాలో ఆడిన హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. హెడ్ ను సిరాజ్ అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. లబుషేన్ 64, ఓపెనర్ మెక్ స్వీనీ 39 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 4, నితీశ్ కుమార్ రెడ్డి 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.