'పుష్ప-2'పై ట్రోల్స్.. అనసూయ స్పందన

  • 'పుష్ప-2' పై రెండు విధాలుగా స్పందిస్తున్న ప్రేక్షకులు
  • 'పుష్ప-2' కంటే 'పుష్ప-1' సినిమా బాగుందనేది కొందరి అభిప్రాయం
  • ఒక పార్ట్ ను మరో పార్ట్ తో పోల్చడం సబబు కాదన్న అనసూయ
ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప-2'పైనే చర్చ జరుగుతోంది. కొందరు సినిమా సూపర్ హిట్ అంటుంటే... మరికొందరు 'పుష్ప-2' కంటే 'పుష్ప-1' సినిమా బాగుందని చెపుతున్నారు. 'పుష్ప-2'పై ట్రోలింగ్ కూడా భారీగానే జరుగుతోంది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ విమర్శలపై సినీ నటి అనసూయ భరద్వాజ్ ఎక్స్ వేదికగా స్పందించింది. 'నా అభిప్రాయం ప్రకారం... సీక్వెల్ అంటే ఒక కథకు కొనసాగింపు అని కదా అర్థం. మరి ఆ పార్ట్ తో ఈ పార్ట్ ని పోల్చడం ఎంత వరకు సబబు అంటాను. ఒక ఫ్లోలో కదా చూడాల్సింది తర్వాత ఏం జరిగిందని' అని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అనసూయ కూడా నటించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు, టాక్ ఎలా ఉన్నప్పటికీ... ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల వసూళ్లను రాబట్టిందని బాక్సాఫీస్ కలెక్షన్లను వెల్లడించే 'శాక్ నిల్స్' పేర్కొంది.


More Telugu News