'పుష్ప-2'పై ఉత్తరాదిలో ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్!
- ఉత్తరాదిలో 'పుష్ప-2' సినిమాకు ఎక్కువ థియేటర్స్ కేటాయించడంపై పెదవి విరుపు
- ఈ మూవీ కారణంగా హాలీవుడ్ సినిమా 'ఇంటర్స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందంటూ విమర్శ
- హాలీవుడ్ వారే మన సినిమాలను మెచ్చుకుంటున్నారన్న జాన్వీ
- కానీ మనం మన చిత్రాలనే తక్కువ చేసుకుంటున్నామంటూ ఆగ్రహం
'పుష్ప-2' సినిమాకు ఉత్తరాదిలో ఎక్కువ థియేటర్స్ కేటాయించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందంటూ విమర్శిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నటించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. తాజాగా ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకోవడంతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.
అయితే ఎక్కువ శాతం ఐమాక్స్ థియేటర్లలో ‘పుష్ప-2’ ఉండటం వల్ల మన దగ్గర 'ఇంటర్స్టెల్లార్' రీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. దీంతో కొందరు అల్లు అర్జున్ సినిమాకు ఎందుకు ఎక్కువ థియేటర్స్ కేటాయించారంటూ నెట్టింట పోస్టులు చేయడం మొదలు పెట్టారు.
ఇలాంటి ఓ పోస్టుపైనే తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ స్పందించారు. హాలీవుడ్ వారే మన సినిమాలను మెచ్చుకుంటున్నారని, కానీ మనం మాత్రం మన చిత్రాలను తక్కువ చేసుకుంటున్నామంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పుష్ప-2 కూడా ఒక సినిమానే కదా. ఈ చిత్రాన్ని మరొక దానితో పోలుస్తూ తక్కువ చేయడం ఎంతవరకు సబబు? మీరు ఏదైతే హాలీవుడ్ మూవీకి మద్దతు ఇస్తున్నారో వారే ఇప్పుడు మన చిత్రాలను మెచ్చుకుంటున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది" అని జాన్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బాలీవుడ్లో 'పుష్ప-2' సినిమా తొలిరోజు ఏకంగా రూ.72 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ హిందీ సినిమా కూడా మొదటి రోజున ఇంత భారీ కలెక్షన్లు రాబట్టింది లేదు. బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజు వసూళ్లు రూ.65.5 కోట్లు కాగా... ఇప్పుడది 'పుష్ప-2' దెబ్బకు రెండో స్థానానికి పరిమితమైంది.
ఇక జాన్వీ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన 'దేవర'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె నటన, గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉన్న సమయంలోనే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ చిత్రంలో నటించే ఛాన్స్ ను జాన్వీ కపూర్ దక్కించుకున్నారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. 'ఆర్సీ 16' అనే వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే షూటింగ్ మొదలైంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.