విశాఖలో విమానాల దారిమళ్లింపు

  • ఎయిర్ పోర్టును కమ్మేసిన పొగమంచు
  • వెలుతురు సరిగా లేకపోవడంతో నిర్ణయం
  • ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సూచన
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వైజాగ్ ను పొగమంచు కమ్మేసింది. శనివారం ఉదయం పొగమంచు కారణంగా ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కుదరలేదు. వెలుతురు సరిగా లేకపోవడంతో ల్యాండింగ్ కు ఇబ్బంది కాగా పలు విమానాలను దారి మళ్లించారు. నిబంధనల మేరకు వెలుతురు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ఢిల్లీ -విశాఖపట్నం ఫ్లైట్‌ను భువనేశ్వర్ వైపు, హైదరాబాద్ -విశాఖపట్నం, బెంగళూరు- విశాఖపట్నం విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఉదయంపూట పొగమంచు ఎక్కువగా ఉండడంతో స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడంలేదని, ఉదయంపూట కూడా హెడ్ లైట్లు ఆన్ చేసుకుని వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. హెడ్ లైట్స్ ఆన్ చేసినా వాహనాలు మరీ దగ్గరికి వచ్చే వరకూ కనిపించడంలేదని చెప్పారు.


More Telugu News