వాళ్లు మా వాళ్లు కాదు... అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాఖ్యలు

  • అల్లు అర్జున్ అభిమానుల సంఘం పేరుతో న్యూస్ ఛానల్స్, యూట్యూబ్‌ లలో మాట్లాడుతున్న కొందరు అభిమానులు 
  • అభిమానుల భావజాలానికి అధికారిక మద్దతు ఉండదన్న ఫ్యాన్స్ అసోసియేషన్
  • అలాంటి అభిమానులను దూరం పెట్టడం జరుగుతుందని వెల్లడి 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సంఘం పేరుతో కొంత మంది అభిమానులు కొన్ని ఛానల్స్‌ ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ దీనిపై స్పందించింది. అల్లు అర్జున్ తరపున ఎవరైనా అభిమానులు టీవీ లేదా యూట్యూబ్‌‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చినా అది వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. 

అభిమానుల భావజాలానికి అధికారిక మద్దతు ఉండదని పేర్కొన్నారు. ఏ నాయకుడి మీద అయినా అల్లు అర్జున్ అభిమానులమంటూ చెప్పి వ్యాఖ్యలు చేస్తే తాము మద్దతు ఇవ్వబోమని చెప్పారు. అంతే కాకుండా అలాంటి అభిమానులను దూరంగా ఉంచడం జరుగుతుందని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది.


More Telugu News