విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు వేస్తా: బుద్దా వెంకన్న
- చంద్రబాబుకు కుల పిచ్చి ఉందన్న విజయసాయిరెడ్డి
- నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బుద్దా వెంకన్న హెచ్చరిక
- విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులపిచ్చి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మానవ విలువలు లేని వ్యక్తి విజయసాయి అని అన్నారు. జగన్ కు, విజయసాయిరెడ్డికి కుల పిచ్చి ఉందేమో కానీ, చంద్రబాబుకు లేదని చెప్పారు.
విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని... ఆయనను జైలుకు పంపేంత వరకు వదలనని బుద్దా వెంకన్న అన్నారు. వ్యాపారవేత్తలను భయపెట్టి, బెదిరించి ఆస్తులు రాయించుకుంటారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.