ప్రజాదర్బార్‌కు నేటితో 50 రోజులు.. కష్టం ఏదైనా అండగా లోకేశ్
- సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేశ్ ప్రజా దర్బార్
- ఇప్పటివరకు ప్రజల నుంచి 5,810 విజ్ఞప్తులు స్వీకరణ
- 4,400 సమస్యలకు పరిష్కారం
- ప్రజాదర్బార్ తలుపుతట్టిన వారికి తోడుగా నిలుస్తున్న లోకేశ్
కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నేటికి 50 రోజులు పూర్తిచేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజాదర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది. వైసీపీ పాలనలో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి గోడు ఆలకించిన వారు లేరు. తమ కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్న బాధితులను నిర్దాక్షణ్యంగా బయటకు నెట్టి గేట్లు వేసిన పరిస్థితి. అప్రజాస్వామిక పాలనను అంతమొందించాలని ప్రజలు సంకల్పించారు. దీంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్యులకు అండగా నిలుస్తోంది. వారి కష్టాలను విని పరిష్కరించేందుకు లోకేశ్ పదవీ బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు 50 ప్రజాదర్బార్‌లు నిర్వహించి బాధితుల కన్నీరు తుడిచారు.
ప్రజాదర్బార్‌లో వచ్చిన విజ్ఞప్తుల్లో 75శాతం పరిష్కారం
గతంలో పలువురు ప్రజాప్రతినిధులు నిర్వహించిన ప్రజాదర్బార్‌లకు విభిన్నంగా మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ కొనసాగుతోంది. ప్రజాదర్బార్‌లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు 75శాతం సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలను పరిష్కరించారు. 1,410 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50 శాతం వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి. ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూవివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు.
ప్రజాదర్బార్ ద్వారా పరిష్కరించిన సమస్యలు
రాష్ట్ర ప్రభుత్వం 36 ఏళ్ల క్రితం తనకు అసైన్డ్ చేసిన 1.04 ఎకరాల భూమిని గంగవరం గ్రామానికి చెందిన జాలాది చంద్రరావు కుటుంబం ఆక్రమించిందని, విచారించి కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన మురుదుడ్ల రాజు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు సదరు భూమి వద్దకు వెళ్లి ఆక్రమణలు తొలగించారు. రాజుతో పాటు కుటుంబ సభ్యులు, చుట్టపక్కల రైతులు, గ్రామ పెద్దల సమక్షంలో సదరు భూమిని కొలిచి, సర్వే చేసి సరిహద్దులు చూపించడంతో సమస్య పరిష్కారమైంది.
తన కుమార్తె జనన ధ్రువీకరణ పత్రంలో ఊరిపేరు తప్పుగా నమోదైందని, సరిదిద్దేందుకు నాలుగు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొదిలివారిపాలెంకు చెందిన గాదె శివ సత్యనారాయణ లోకేశ్‌ను కలిసి విన్నవించారు. తక్షణమే స్పందించిన ఆయన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సదరు విజ్ఞప్తిని పరిశీలించిన అధికారులు తప్పును సరిదిద్ది శివసత్యనారాయణ కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు.
అత్యవసర వైద్య సాయం అవసరమైన వారికి అండగా నిలిచి పలువురి ప్రాణాలను లోకేశ్ కాపాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సింగపోగు సుశాంతి ఓ ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కళాశాల పని నిమిత్తం ఒంగోలు బస్టాండ్ నుంచి ద్విచక్ర వాహనంపై క్విస్ ఫార్మసీ కళాశాలకు వెళ్తుండగా జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లారు. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భవతి. వైద్యసాయం కోసం ఎక్స్ ద్వారా లోకేశ్‌ను సంప్రదించారు. తక్షణమే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.5 లక్షల సాయం అందించి మహిళ ప్రాణాలు నిలిపారు.
ప్రజాదర్బార్ కు విశేష స్పందన
కష్టాల్లో ఉన్న వారికి మొదట లోకేశ్ ప్రజాదర్బార్ గుర్తొస్తోంది. ఇక్కడకు వస్తే చాలు తమ సమస్యలకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీంతో ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ ఏర్పాటుచేయగా క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బాధితులు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. గత పాలకుల మాదిరిగా ఇక్కడ ఎలాంటి బారికేడ్లు, పరదాలు లేవు. ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనే హామీని మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు. ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను ఉదయం 8 గంటలకు స్వయంగా కలుసుకుని వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. జిల్లాల పర్యటనలోనూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులనూ స్వీకరించి పరిష్కరిస్తున్నారు.
గల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపిన లోకేశ్
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి నేనున్నానంటూ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. చాలీచాలని జీతాలతో, అక్రమ నిర్బంధాలకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను రక్షించి స్వస్థలాలకు చేర్చాలని సోషల్ మీడియా వేదికల ద్వారా బాధితులు చేసిన విజ్ఞప్తులకు మానవత్వంతో స్పందించారు. గల్ఫ్‌లో చిక్కుకున్న దాదాపు 21 మందిని రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ముగిసిపోయిందనుకున్న తమ జీవితాలకు మంత్రి లోకేశ్ ప్రాణం పోశారంటూ వారంతా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు.
సత్వర పరిష్కారానికి కృషి
సోషల్ మీడియా, ప్రజాదర్బార్‌లో వచ్చే సమస్యల సత్వర పరిష్కారానికి మంత్రి లోకేశ్ కృషిచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా మంత్రులతో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటివరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ కష్టాలకు, సమస్యలకు ప్రజాదర్బార్ ద్వారా పరిష్కారం లభిస్తుండటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.