మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప-2 దర్శకుడు సుకుమార్, నిర్మాతలు

  • నేడు పుష్ప-2 గ్రాండ్ రిలీజ్
  • విడుదలకు ముందు మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న చిత్రబృందం
  • ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి 
గత మూడేళ్లుగా భారీ హైప్ తో అందరిలో ఆసక్తి రేకెత్తించిన పుష్ప-2 ది రూల్ చిత్రం నేడు (డిసెంబరు 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లోనూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 

కాగా, ఈ చిత్రం విడుదలకు ముందు చిత్రబృందం మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ... చిరంజీవి నివాసానికి వెళ్లారు. సినిమా విడుదల నేపథ్యంలో ఆయన ఆశీస్సులు అందుకున్నారు.

చిరంజీవి పుష్ప-2 చిత్రాన్ని ఇంకా వీక్షించలేదని తెలుస్తోంది. తనను కలిసిన పుష్ప-2 దర్శక నిర్మాతలకు చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


More Telugu News