ఎంపీ ఒడిలో దర్జాగా నిద్రించిన కోతి.. శశిథరూర్ కు వింత అనుభవం

--
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు బుధవారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఉదయాన్నే గార్డెన్ లో కూర్చుని పేపర్ చదువుతుంటే ఓ కోతి అక్కడికి వచ్చింది. ఎలాంటి బెదురులేకుండా నేరుగా ఎంపీ ఒడిలోకి చేరి అక్కడే సెటిలయింది. థరూర్ దానికి రెండు అరటి పండ్లు ఇవ్వగా తినేసి ఆయన ఒడిలో కాసేపు నిద్రించింది. ఈ కోతి చేష్టలను గమనిస్తూనే తన మానాన తను పేపర్ చదువుకుంటూ ఉండిపోయానని థరూర్ చెప్పారు. 

కాసేపటి తర్వాత కుర్చీలో నుంచి లేచేందుకు తాను ప్రయత్నించడంతో కోతి కిందకు దూకి ఎటో వెళ్లిపోయిందని వివరించారు. వన్యప్రాణుల పట్ల తనకెంతో ప్రేమ అని, కోతి దాడి చేస్తే రేబిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందినా.. అలాంటిదేం జరగనందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ అనుభవానికి సంబంధించిన ఫొటోలను ఎంపీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో కోతి ఆయన ఒడిలో దర్జాగా కూర్చోవడం చూడొచ్చు.



More Telugu News