థియేటర్‌లో అల్లు అర్జున్‌కు అభిమానుల స్టాండింగ్ ఒవేషన్.. వీడియో వైరల్!
- సంధ్య థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి పుష్ప-2 చూసిన అల్లు అర్జున్
- గంగమ్మ జాతర సీన్‌లో ఆయన నటనను చూసిన అభిమానుల స్టాండింగ్ ఒవేషన్
- దాంతో వారికి కృతజ్ఞతలు తెలిపిన బన్నీ
ఐకాన్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప2: ది రూల్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బుధవారం రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు ఇవాళ మార్నింగ్ షోలు కూడా పడిపోయాయి. దీంతో థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది.
కాగా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్‌లో ఫ్యామిలీ, అభిమానులతో కలిసి అల్లు అర్జున్ నిన్న రాత్రి ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతర సీన్‌లో ఆయన నటనను చూసిన అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దాంతో బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. మనం విజయం సాధించామంటూ విక్టరీ సింబల్‌తో అభివాదం చేశారు. ప్రస్తుతం దీని తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ మూవీకి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన వారు సినిమా బాగుందని అంటున్నారు. గంగమ్మ జాతర ఎపిసోడ్ మూవీలో టాప్‌నాచ్ అని టాక్. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచి పుష్ప-2, అల్లు అర్జున్, వైల్డ్‌ఫైర్ పుష్ప హ్యాష్ ట్యాగ్‌లు ఎక్స్ (ట్విట్టర్)లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.