ఈ నెల 25 నుంచి పార్లమెంటు సమావేశాలు.... టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- ఎంపీలకు దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
- కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులపై చర్చ
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉన్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని, విజన్ డాక్యుమెంట్‌కు కేంద్ర సహకారం అవసరమని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా వాడుకొని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు ముఖ్యమైనదని, దీనికి నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. కూటమికి ఉన్న 21 మంది ఎంపీలం పార్లమెంట్ సమావేశాల్లో సమయానుకూలంగా స్పందిస్తామని వెల్లడించారు.
మరో వైపు.. జనసేన ఎంపీలతో తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు తదితర అంశాలపై పవన్ ఎంపీలకు సూచనలు చేశారు.