అలియా సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జక్కన్న
- లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న జిగ్రా
- మెయిన్ రోల్‌లో నటించిన అలియా భట్
- 'ఎక్స్' వేదికగా ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపిన రాజమౌళి
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన తాజా చిత్రం 'జిగ్రా'. ఈ మూవీ అక్టోబర్ 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే జిగ్రా తెలుగు ట్రైలర్‌ను షేర్ చేశారు.
"అత్యుత్తమ నటనతో అలియా భట్ ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పుడు జిగ్రా సినిమాతో వస్తున్నారు. ఈ మూవీ ఎమోషన్‌ల్ రైడ్‌లా కనిపిస్తోంది. అక్టోబర్ 11న విడుదలయ్యే ఈ చిత్రం విషయంలో ఆమెకు, చిత్ర బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్" అని జక్కన్న ట్వీట్ చేశారు.
కాగా, జక్కన్న తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీలో అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడిగా సీత పాత్రలో ఆమె కనిపించి మెప్పించారు.
ఇక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న 'జిగ్రా' మూవీ తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. హిందీ వెర్షన్ రిలీజ్ అయిన రోజే తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనుంది.
'జిగ్రా' తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో మూవీ వస్తున్నట్లు అర్థమవుతోంది.