పబ్లిక్ టాయిలెట్స్‌లో విప్లవం.. హైదరాబాద్‌లో త్వరలో లూ-కేఫ్స్!

  • స్మార్ట్ ఈ-టాయిలెట్స్ తీసుకొస్తున్న కేంద్రం
  • ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి
  • పూర్తి హైటెక్ హంగులతో పబ్లిక్ టాయిలెట్స్
  • ముందు వైపు కేఫ్.. వెనక వాష్‌రూములు
భాగ్యనగరం హైదరాబాద్‌లో టాయిలెట్‌ రూపం మారబోతోంది. స్మార్ట్ టాయిలెట్ రివల్యూషన్‌లో భాగంగా త్వరలోనే అంతటా ‘లూ కేఫ్స్’ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో పబ్లిక్ టాయిలెట్‌తోపాటు కేఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ అవడమే కాదు.. కాసేపు ఫ్రెండ్స్‌తో రిలాక్స్‌డ్‌గా కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా అర్బన్ శానిటేషన్‌లో భాగంగా ‘స్మార్ట్ ఈ-టాయిలెట్స్‌’ను తీసుకురావాలని కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ తెలిపింది.

స్మార్ట్ టాయిలెట్‌లోకి ప్రవేశించగానే తొలుత కేఫ్ ఉంటుంది. వెనక వాష్‌రూమ్స్ ఉంటాయి. అవి కూడా మామూలుగా సాదాసీదాగా ఉండవు. లగ్జరీగా ఉంటాయి. పబ్లిక్ శానిటేషన్‌లో లూ కేఫ్స్ సరికొత్త అనుభవాన్ని ఇవ్వనున్నాయి. మహారాష్ట్రలోని పింప్రి చించ్‌వాడ్‌లో వివిధ ప్రాంతాల్లో పబ్లిక్-ప్రైవేట్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో 26 లూ కేఫ్స్ కడుతున్నారు. 

ఈ స్మార్ట్ టాయిలెట్స్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఆటోమెటిక్ ఫ్లషింగ్, పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా రూములు, వాయిస్ అసిస్టెంట్, పవర్ బ్యాకప్, ఆటోమెటెడ్ ఫ్లషింగ్ సెన్సార్లు వంటివి ఉంటాయి. ఇవి నిత్యం పూర్తి పరిశుభ్రంగా ఉంటాయి. త్వరలోనే ఇవి హైదరాబాద్‌లోనూ కనిపించనున్నాయి.


More Telugu News