డీఎస్సీకి హాజరయ్యే గిరిజన అభ్యర్థులకు ఏపీ సర్కార్ తీపి కబురు
- రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ
- ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో శిక్షణ కేంద్రాలు
- ఒక్కో సెంటర్‌లో 150 మంది అభ్యర్థులకు శిక్షణ
- 3 నెలల శిక్షణకు ఒక్కో అభ్యర్థిపై రూ.25వేలు ఖర్చు చేయనున్న సర్కార్
డీఎస్‌సీ రాసే గిరిజన అభ్యర్థులకు ఏపీలోని కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
ఒక్కో సెంటర్‌లో 150 మంది చొప్పున, మూడు నెలల పాటు శిక్షణ వుంటుంది. దీనికోసం ఒక్కో అభ్యర్థికి ప్రభుత్వం పాతికవేల రూపాయలు వెచ్చించనుంది. ఇక 16,347 పోస్టులతో ఏపీ సర్కార్ భారీ డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల బీభత్సం కారణంగా ఈ ఉచిత శిక్షణ తాలూకు తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.