ఔటర్ రింగ్ రోడ్డులోని పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్
- రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల విలీనం
- ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు గ్రామాల వరకు విలీనం
- శంషాబాద్, పెద్దఅంబర్‌పేట సహా పలు మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పలు గ్రామాలను ఆయా మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు వరకు గ్రామాలను విలీనం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు ఈ విలీన జాబితాలో ఉన్నాయి.
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో నాలుగు గ్రామాలు, శంషాబాద్‌లో ఆరు, నార్సింగి, తుక్కుగూడలలో ఒక్కో పంచాయతీ, మేడ్చల్‌లో రెండు, దమ్మాయిగూడలో ఆరు, నాగారంలో నాలుగు, పోచారంలో ఐదు, ఘట్‌కేసర్‌లో ఆరు, గుండ్లపోచంపల్లిలో రెండు, తూంకుంట మున్సిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.