హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
- కొంతమంది అధికారులు హైడ్రా పేరుతో బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయన్న సీఎం
- గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నట్లు తెలిసిందని వ్యాఖ్య
- వసూళ్లకు పాల్పడేవారిపై దృష్టి సారించాలని విజిలెన్స్‌కు సీఎం ఆదేశాలు
హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ... హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు.
గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.