ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

  • ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏ కట్టడం ఉన్నా కూల్చేస్తామని స్పష్టీకరణ
  • హైడ్రా నోటీసులు ఇవ్వదు... నేరుగా కూల్చేస్తుందని వ్యాఖ్య
  • ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలకు సమయమిస్తాం... విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని వ్యాఖ్య
ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్న ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏ కట్టడం ఉన్నా కూల్చేస్తామని స్పష్టం చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు ఉంటే హైడ్రా నోటీసులు ఇవ్వదని, నేరుగా కూల్చేస్తుందన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారబోదన్నారు.

ఒవైసీ లేదా మల్లారెడ్డి అని హైడ్రా చూడదని... కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచిస్తామన్నారు. చెరువులను ఆక్రమించి కాలేజీలు నిర్మాణం చేయడం పొరపాటే అన్నారు. ఎఫ్‍‌‌టీఎల్ అనేది చాలా ముఖ్యమన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి... అలాంటి కాలేజీలకు కొంత సమయం ఇస్తామన్నారు.

పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ధర్మసత్రం ఉన్నా కూల్చేస్తామన్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు బీజేపీ నాయకులు హైడ్రా కమిషనర్‌ను కలిసి నగరంలో ఆక్రమణకు గురైన పలు చెరువులకు సంబంధించిన వివరాలను ఇచ్చారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా కమిషనర్ స్పందించారు.


More Telugu News