కేశవరావు రాజీనామాకు ఆమోదం

  • రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్
  • రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయిందని బులెటిన్ విడుదల
  • ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ సీనియర్ నాయకుడు కె.కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఆయన మూడు రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

పార్టీ మారిన నేపథ్యంలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయిందని రాజ్యసభ సచివాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.


More Telugu News