సీఎం చంద్రబాబుతో సమావేశంపై అప్ డేట్ ఇచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

  • ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
  • కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీ
  • ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. చంద్రబాబుతో భేటీపై నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చారు. 'ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, ఉన్నతాధికారులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్షించాను' అని గడ్కరీ వెల్లడించారు. 

ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించాను అని తెలిపారు. అందరం కలిసి సమష్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళతామన్న నమ్మకం నాకుంది అంటూ చంద్రబాబు కేంద్రమంత్రి గడ్కరీ ట్వీట్ ను రీపోస్ట్ చేశారు.

కాగా, గడ్కరీతో సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.



More Telugu News