టీ20 ప్రపంచకప్ చరిత్రలో 43 ఏళ్ల ఉగాండా బౌలర్ సెన్షేనల్ రికార్డు
- పాపువా న్యూగినియా మ్యాచ్‌లో ఫ్రాంక్ ఎన్‌సుబుగా నయా చరిత్ర
- నాలుగు ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లు
- టీ20 ప్రపంచకప్‌లో 1.00 ఎకానమీ నమోదు
- దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ రికార్డు బద్దలు
అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అత్యంత అరుదైన రికార్డు ఒకటి నమోదైంది. ఆ రికార్డు సృష్టించింది కూడా మరెవరో కాదు.. ఓ అనామక జట్టుకు చెందిన 43 ఏళ్ల బౌలర్. గురువారం గయానాలో ఉగాండా-పాపువా న్యూగినియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఉగాండా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ప్రత్యర్థి గినియా జట్టును 77 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో ఉగాండా సీనియర్ బౌలర్ ఫ్రాంక్ ఎన్‌సుబుగా కీలకపాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసిన ఎన్‌సుబుగా రెండు మెయిడెన్లు తీసుకుని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఎకానమీ(1.00) రేటు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ నమోదు చేసిన 2.25 ఎకానమీని అధిగమించి రికార్డును తన పేరుపై రాసుకున్నాడు.