2024 టీ20 వరల్డ్‌కప్ ఆంథమ్ విడుదల.. పొట్టి ప్రపంచకప్ వేడుకలు షురూ!
- టీ20 వరల్డ్‌కప్ అధికారిక గీతం 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్'ను రూపొందించిన సీన్ పాల్, కేస్
- మ్యూజిక్ వీడియోలో సందడి చేసిన బోల్ట్, క్రిస్ గేల్
- జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో టోర్నీ
మరో 29 రోజుల్లో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభం కానుంది. ఇటీవల ఆయా దేశాలు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా పొట్టికప్ సంబరాలు షురూ అయ్యాయి. కాగా, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆంథమ్‌ను తాజాగా విడుదల చేసింది. గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ టీ20 ప్రపంచకప్ అధికారిక గీతం 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' ను రూపొందించారు. ఇక ఈ ఆంథమ్ విడుదలతో వరల్డ్‌కప్ వేడుకలు మొదలైపోయాయి.
మ్యూజిక్ వీడియోలో బోల్ట్, గేల్ సందడి
వరల్డ్‌కప్ ఆంథమ్ వీడియోలో ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఉసేన్ బోల్ట్, విండీస్ స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, అలీ ఖాన్, శివనారాయణ్ చంద్రపాల్, ఇతర కరేబియన్ ప్రముఖులు కనిపించారు. మ్యూజిక్ వీడియోలో వాళ్లంతా క్రికెట్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూడటానికి అభిమానులు వెళ్లినప్పుడు కలిగే వినోదం, ఉత్సాహాన్ని వీడియో చూపిస్తుంది.
ఇక జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈసారి 20 జట్లు పాల్గొంటున్న ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది.