ఈ వారం అలరించనున్న వైవిధ్యభరిత సినిమాలు ఇవే
- కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు
- పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో వరుసగా క్యూ
- ఓటీటీలోనూ సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ ముగియడం, వేసవి సెలవులు రావడంతో బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడనుంది. అయితే పెద్ద సినిమాలన్నీ జూన్ చివర, ఆ తర్వాత తేదీల్లోనే ఉండటంతో చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మే తొలి వారంలో కొన్ని వైవిధ్యభరిత చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాయి. అలాగే థియేటర్లకు నప్పని కంటెంట్ ఉన్న చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఓ లుక్కేయండి.
మళ్లీ కామెడీ కితకితలతో అల్లరి నరేశ్..
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కామెడీ బాట పట్టారు అల్లరి నరేశ్. గతంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ తో నరేశ్ మే 3న థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో నరేశ్ కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. పెళ్లి కాని ప్రసాద్ లకు సమాజం వేసే ప్రశ్నలకు దర్శకుడు మల్లి అంకం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ సమాధానం ఇవ్వనున్నారు. రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి.
ఫేస్ బ్లైండ్‌నెస్ ఇతివృత్తంతో..
వెండితెరపై ఎన్నో ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అదే కోవలో ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అనే కొత్త పాయింట్ తీసుకొని థ్రిల్లర్ జానర్ తో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు వస్తున్నారు హీరో సుహాస్. ఇప్పటికే పలు వైవిధ్యభరితమైన సినిమాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ ఈ చిత్రంలో ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అనే వ్యాధితో బాధపడే యువకుడిగా కనిపించనున్నారు. మూడు మర్డర్ కేసుల్లో ఇరుక్కున్న హీరో వాటి నుంచి తప్పించుకున్నాడా? అసలు హంతకుడిని చట్టానికి పట్టించాడా? అనేది ఈ సినిమా కథ. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు అర్జున్ వై.కె దర్శకత్వం వహించగా జె.ఎస్ మణికంఠ, టి.ఆర్.ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో వస్తున్న ‘శబరి’
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శబరి’. మే 3న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. మహేంద్రనాథ్ కూండ్ల దీన్ని నిర్మించారు. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఎన్నో మలుపులున్న ఈ కథ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. తెలుగులో వరలక్ష్మీ నటించిన తొలి నాయిక ప్రధానమైన చిత్రం ఇదే కావడం విశేషం.
హారర్ కామెడీ థ్రిల్లర్ గా ‘బాక్’
ప్రముఖ దర్శకుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ సినిమా ఇది. తమన్నా, రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతలు. వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయాలనుకున్నా కుదరకపోవడంతో ఇది కూడా మే 3నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వాస్తవ సంఘటనలతో ‘జితేందర్ రెడ్డి’
ఉయ్యాల జంపాల చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విరించి వర్మ. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం జితేందర్ రెడ్డి. రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమా ఇది. 1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘బాహుబలి’తో గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌వర్రే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కూడా మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీలో అలరిస్తున్న/సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
– డియర్ (తమిళ/తెలుగు) ఏప్రిల్ 28
– బాయిలింగ్ పాయింట్-1 (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 29
– హీరామండి (హిందీ సిరీస్) మే 1
– షైతాన్ (హిందీ) మే 3
– ది ఎ టిపికల్ ఫ్యామిలీ (కొరియన్) మే 4
డిస్నీ+హాట్‌స్టార్
– ది వీల్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 30
అమెజాన్ ప్రైమ్
– ది ఐడియా ఆఫ్ యూ (హాలీవుడ్) మే 2
జియో సినిమా
– హాక్స్3 (వెబ్‌సిరీస్) మే 3
– వోంకా (హాలీవుడ్) మే 3
– ది టాటూయిస్ట్ ఆఫ్ ఆష్‌విజ్ (వెబ్‌సిరీస్) మే 3