ఇండియాలోనే అత్యంత ఖరీదైన టీ.. కిలో టీ పోడి ధర అక్షరాల రూ. 1.50 లక్షలు
- పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో దొరికే ఖరీదైన టీ
- టీకి ఉండే ప్రత్యేకమైన నాణ్యత, రుచినే అంత ఖరీదుకు కారణం
- ప్రత్యేకమైన టేస్ట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ టీ
టీ, కాఫీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చాలా మందికి నిద్రలేచిన తర్వాత టీ గానీ, కాఫీ గానీ తాగనిదే వారికి ఆ రోజు మొదలవదు. ఇక కొంతమంది ఉదయం, సాయంత్రం రెండు పూటల వీటిని సేవిస్తుంటారు. ఇక మాములుగా మన ఇళ్లలో తెచ్చుకునే టీ ధర కిలో రూ. 100 నుంచి రూ. 500 వరకు ఉండడం కామన్. కానీ, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుబోయే టీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం.
ఒక కిలో టీ పోడి ధర అక్షరాల రూ. 1.50 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఈ టీ దొరుకుతుంది. ఇంత ఖరీదుకు కారణం ఆ టీకి ఉండే ప్రత్యేకమైన నాణ్యత, రుచినే కారణం.
కాగా, ఈ టీ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ వ్యసనపరులు ఒక్కసారైనా ఈ ప్రత్యేకమైన టీని టేస్ట్ చేయాలని పరితపిస్తుంటారట. ఇక ఈ టీని రుచి చూడాలంటే మాత్రం డార్జిలింగ్‌లో ఎప్పుడూ సందడిగా ఉండే మాల్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్లాల్సిందే.