భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని ఏప్రిల్ 4న ఈసీ ఆంక్షలు
- ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరిన తెలంగాణ దేవాదాయ శాఖ
- ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీల అభ్యంతరం
- దీంతో రేపటి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చిన ఎన్నిల సంఘం
భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రాములవారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని ఏప్రిల్ 4న ఈసీ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
నాలుగు దశాబ్దాలుగా రాములవారి కల్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు, దేవుడికి సంబంధం లేదని పేర్కొన్నాయి. స్పందించిన ఎన్నికల సంఘం రేపటి కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చింది.