రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలార్ నటి

  • ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ చిత్రం
  • ఓ చిన్న పాత్ర పోషించిన పూజా విశ్వేశ్వర్
  • అనకాపల్లిలో రోడ్ డివైడర్ ను ఢీకొట్టిన బైక్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటి
ప్రభాస్ చిత్రం సలార్ లో నటించిన పూజా విశ్వేశ్వర్ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పూజా విశ్వేశ్వర్ స్వస్థలం విశాఖపట్నం. అనకాపల్లి రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. వెంటనే స్పందించిన అక్కడివారు పూజా విశ్వేశ్వర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ముఖంపై గట్టి దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. వైద్యులు ప్రాణాపాయం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పూజా విశ్వేశ్వర్ సలార్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపిస్తుంది. కాటేరమ్మ ఫైట్ సీన్ ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది.


More Telugu News