కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు నాకు ఏ అభ్యంతరం లేదు: షర్మిల
- ఇడుపులపాయ వచ్చిన షర్మిల
- కాంగ్రెస్ లో చేరికపై షర్మిలను ప్రశ్నించిన మీడియా
- తెలంగాణలో తాను చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ గుర్తించిందన్న షర్మిల
- రేపు ఢిల్లీ వెళుతున్నట్టు వెల్లడి
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత నిచ్చారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. రేపు ఢిల్లీకి వెళుతున్నానని, ఢిల్లీలో జరిగే పరిణామాలే అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతాయని అన్నారు. తెలంగాణలో తాను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం విలువ ఇచ్చిందని షర్మిల పేర్కొన్నారు.
ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు. "కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ముందే నిర్ణయించుకున్నాం. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉందంటే, అందుకు మేం చేసిన సాయం కూడా కారణం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో మా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది.
31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కారణం... మేం పోటీ చేయకపోవడమే. తెలంగాణ ఎన్నికల్లో వైస్సార్టీపీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. ఈ కృతజ్ఞతా భావం కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను చేసిన త్యాగానికి, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విలువనిచ్చింది.
అందుకే నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఇవాళ దేశంలో అతిపెద్ద లౌకికవాద పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. ప్రతి ఒక్కరికీ భద్రతనిచ్చే పార్టీ... కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో అతి త్వరలోనే, రేపే ఢిల్లీకి ప్రయాణమవుతున్నాం. ఒకట్రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలు సమాధానాలు వస్తాయి" అని షర్మిల పేర్కొన్నారు.
షర్మిల ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి తనయుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియతో కలిసి ఇడుపులపాయ వచ్చారు. తొలి పెళ్లి కార్డును వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్థం ఈ నెల 18న జరగనుండగా, ఫిబ్రవరి 17న వీరి పెళ్లి జరగనుంది.