పీఎస్ఎల్వీ-58 ప్రయోగం విజయవంతంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం

  • ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి
  • అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారత్ నిలిచిందని ప్రశంస
  • ఇస్రో రోదసీలో భారత పతాకాన్ని ఎగురవేసిందన్న రేవంత్ రెడ్డి
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలను ఆయన అభినందించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారత్ అవతరించిందని కొనియాడారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసీలో భారత పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


More Telugu News