నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ

  • శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ 
  • అనంతరం, గన్ పార్క్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించనున్న ఎమ్మెల్యేలు
  • ఉదయం 11 గంటలకు అసెంబ్లీ తొలి సమావేశానికి హాజరు
  నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కేసీఆర్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. 

కాగా, ఈ సమావేశం అనంతరం కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ తొలి సమావేశానికి హాజరవుతారు.


More Telugu News