టీమిండియా వరల్డ్ కప్ లో ఓడిపోవడాన్ని 'భగ్న ప్రేమ'తో పోల్చిన సఫారీ క్రికెట్ దిగ్గజం
- సొంతగడ్డపై వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా
- టీమిండియాపై సానుభూతి ప్రదర్శించిన డుప్లెసిస్
- గాళ్ ఫ్రెండ్ బ్రేకప్ చెబితే చాలా బాధ కలుగుతుందని వెల్లడి
- టీమిండియా పరిస్థితి కూడా అంతేనని వ్యాఖ్యలు
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను విపరీతంగా బాధించింది. ఐపీఎల్ ద్వారా భారత్ తో ఎంతో అనుబంధం ఉన్న దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కూడా టీమిండియా వరల్డ్ కప్ సాధించలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు.
టీమిండియా వరల్డ్ కప్ లో ఓటమిపాలవడాన్ని డుప్లెసిస్ భగ్న ప్రేమతో పోల్చాడు. గాళ్ ఫ్రెండ్ బ్రేకప్ చెబితే ఎంత బాధ కలుగుతుందో, టీమిండియా పరిస్థితి కూడా అంతేనని అభివర్ణించాడు. ప్రియురాలు వీడిపోయిన బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుందని, వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం పాలైన వేదన నుంచి కోలుకోవడానికి కూడా అంతే సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. 2015 వరల్డ్ కప్ లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని డుప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు.
సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు టీమిండియా ఆట నమ్మశక్యం కాని రీతిలో అద్భుతంగా సాగిందని కొనియాడాడు. "అది వాళ్లు గెలవాల్సిన వరల్డ్ కప్. ఊహించని ఓటమితో వారి హృదయం ముక్కలైంది. కాలమే ఆ గాయాన్ని మాన్పుతుంది" అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.