భైంసాలో కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల రాజేందర్

  • రాష్ట్రంలో కేసీఆర్ పాలన, ముథోల్ లో విఠల్ రెడ్డి పాలన నిజాం సర్కార్‌ను తలపిస్తున్నాయని విమర్శ
  • ప్రతి వంది మందికి ఒక బెల్ట్ షాపును ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని ఎద్దేవా
  • నమ్మకం అంటే మోదీ... అబద్దాలకు కేరాఫ్ కేసీఆర్ అని చురకలు
భైంసాలో ఈసారి కాషాయజెండా ఎగరడం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ముథోల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కేసీఆర్ పాలన, ముథోల్‌లో విఠల్ రెడ్డి పాలన.. నిజాం సర్కార్ పాలనను తలపిస్తున్నాయన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. కేసీఆర్ ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెంచి... ఇందులో మాత్రం నెంబర్ వన్ స్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు. ప్రతి వందమందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదే అని మండిపడ్డారు. ఓ వైపు సంక్షేమానికి రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తూ... మరోవైపు మనందరికీ మద్యం అలవాటు చేసి.. ఆ మద్యం ద్వారా రూ.45వేల కోట్లు లాక్కుంటున్నారని ఆరోపించారు.

నమ్మకం అంటే మోదీ... అబద్ధాలకు కేరాఫ్ కేసీఆర్ అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వరి మద్దతు ధర రూ.3100కు పెంచుతామన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే పెన్షన్ వారిద్దరికీ అందిస్తామన్నారు. వ్యవసాయ పని ముట్లపై సబ్సిడీలు అందిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్‌కు ఓటు వేసి గెలిపిస్తే తనకు ఓటు వేసినట్లే అన్నారు. రామారావు పటేల్ ప్రకటించిన మేనిఫెస్టోను దగ్గర ఉండి అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News